Sunday, December 22, 2024

గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్న హోటల్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై మాదాపూర్ ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులు శనివారం దాడి చేశారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.1,52,000 నగదు, ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హఫీజ్‌పేట, ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన ఎం. బస్వరాజ్ వ్యాపారం చేస్తున్నాడు పరారీలో ఉన్నాడు.

కొండాపూర్, మసీద్‌బండకు చెందిన ఎం. శ్రీకాంత్, ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన ఎన్. కిరణ్, ఇంద్రానగర్ కాలీనికి చెందిన ఎన్. ప్రశాంత్ రెడ్డి కలిసి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. నిందితులు నలుగురు గచ్చిబౌలిలోని సిల్వర్ కీ ఓయో లాడ్జ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలిసింది. మాదాపూర్ ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలిలోని రాజ రాజేశ్వర కాలనీ ప్రాంతంలో సిల్వర్ కీ ఓయో లాడ్జ్ గదిపై దాడి చేసి చట్టవిరుద్ధంగా పేకాడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను కేసు దర్యాప్తు కోసం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News