Friday, January 3, 2025

వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్‌పై దాడి: ఏడుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని వైట్ హౌస్ సిల్వర్ కి హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది.

దీంతో పోలీసులు హోటల్‌పై దాడి చేసి ముగ్గురు హోటల్ సిబ్బంది, ముగ్గురు విటులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులను కేసు దర్యాప్తు కోసం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News