Monday, December 23, 2024

శంషాబాద్ లో ఓ ఫాం హౌస్ పై పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

Employees

రంగారెడ్డి: శంషాబాద్ లో ఓ ఫాం హౌస్ పై ఎస్ఒటి పోలీసుల దాడులు చేశారు. 5 మంది రౌడీ షీటర్లతో  పాటు 47 మంది అనుచరులను ఎస్ఒటి పోలీస్ బృందం అదుపులోకి తీసుకుంది. శంషాబాద్ మండలం రామాంజపూర్ గ్రామంలోని ఫాంహౌస్ లో గబ్బు పార్టీ, ట్రాన్స్ జెండర్ లతో అశ్లీల నృత్యాలు చేయిస్తుండగా పట్టుకున్నారు. 47 మంది మద్యం సేవించి, హుక్కా మత్తులో డిజె సౌండ్స్ కు చిందులు వేశారు. పాతబస్తీకి చెందిన ఓ రౌడీషీటర్ పై షీట్ ఎత్తి వేయడంతో ముజ్రా పేరుతో సదరు రౌడీ షీటర్ పార్టీ  ఇచ్చారు. ఎస్ఓటి బృందం శంషాబాద్ రూరల్ పోలీసులకు వారిని అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి‌ దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News