మన తెలంగాణ/సిటీ బ్యూరో: వాళ్లంతా బడా‘బాబు’లు… నిత్యం రూ.లక్షల్లో బెట్టింగులు. ఒక రు కాదు ఇద్దరు కాదు…ముప్పై మందికి పైగా బెట్టింగులు కాస్తున్నారు. వి షయం తెలుసుకున్న పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో రూ.కోటిన్నరకు పై గా పట్టుబడ్డ నగదుతో పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా…ఆ తర్వాతే సీన్ ఒక్కసారిగా మారింది. రంగంలోకి రాజకీయనేతలు దిగడంతో సెటిల్‌మెంట్ చేసుకుని… దొరికిన సొమ్ము తీసుకుని కేసు లేకుండా నిందితులను వదిలిపెట్టారు. పోలీ సు,రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి. రా జేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలో మూడురోజుల క్రితం బె ట్టింగ్ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ముప్పైమంది బెట్టింగ్ రాయుళ్లను ప ట్టుకున్నారు. ఈ దాడుల్లో సుమారు రూ.కోటిన్నరకు పైగా నగదు కూడా దొరికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో కొందరు రా జకీయ నేతల,పోలీసుల కుటుంబాలకు చెం దిన వారు కూడా ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రముఖుల కుటుంబ సభ్యులతో పాటు భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో నిమిషాల వ్యవధిలోనే రాజకీయనేతలు రంగంలోకి దిగి రాజీ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈక్రమంలోనే పట్టుబడ్డ నిందితుల్లో కొందరిని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి రాయ‘బేరాలు’నడిపినట్లు తెలిసింది.
కొందరు పోలీసు అధికారులతో సెటిల్‌మెంట్ చేసుకుని కేసు నమోదు కాకుండా చూసినట్లు తెలిసింది. ఇందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి మరిది ఉండటంతో ఓ నాయకుడు (సదరు నిందితుడి సోదరుడు) కీలకంగా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ బెట్టింగ్ సొమ్ము(రూ.కోటిన్నరకు పైగా)ను వదిలేయాల్సిందిగా సెటిల్‌మెంట్ చేసుకుని నిందితులపై కేసు లేకుండా వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారమంతా బాహాటంగానే జరిగినట్లు సమాచారం. అయితే, బెట్టింగ్ ముఠాను కష్టపడి పట్టుకుంటే కొందరు ఉన్నతాధికారులు నిందితులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని దొరికినసొమ్మంతా దోచుకుని నిందితులను వదిలేశారని అక్కడిస్థానికులు గుసగుసలలాడుతున్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ పోలీసుస్టేషన్‌లోనే నిందితులతో సెటిల్‌మెంట్ చేసుకుని… చర్యలు చేపట్టకుండా వదిలేయడంపై పోలీసువర్గాలు సైతం మండిపడుతున్నట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.