Tuesday, December 24, 2024

వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి..ముగ్గురు యువతులకు విముక్తి

- Advertisement -
- Advertisement -

యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను హైదరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యభర్తతోపాటు విటుడు, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కండోమ్స్, 11 మొబైల్ ఫోన్లు, డివిఆర్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బంగ్లాదేశ్ దేశానికి చెందిన సలీం మండల్ నగరానికి వచ్చి నార్సింగిలో అతడి భార్య మారియా ఇమ్‌చెన్‌తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు బంగ్లాదేశ్, పశ్బిమబెంగాల్‌కు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. మణికొండకు చెందిన యువతి(22), పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి(20),

అస్సాం రాష్ట్రానికి చెందిన యువతి(21)తో కలిసి లకిడికాపూల్‌లోని అక్షయ హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ విషయం హైదరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో హోటల్‌పై దాడి చేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, నేలపోగుల, తూర్పు కాపుల పేటకు చెందిన నాడిపూడి నాగ నర్సింహాబాబు(27) అరెస్టు చేశారు. నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నర్సింహాబాబు యువతుల కోసం హోటల్‌కు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఎసిపి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్సై అజీజ్, హెచ్‌సి భూపాల్ రెడ్డి, పిసిలు రాజ్‌కుమార్, నరేష్‌కుమార్, దివాకర్, సాయికుమార్, చంద్రకళా తదితరులు దాడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News