- Advertisement -
సిటిబ్యూరోః నిబంధనలు పాటించని వెస్ట్‌జోన్ పరిధిలోని మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దాడుల్లో 34మందిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు పాటించని పార్లర్లపై కేసులు నమోదు చేశారు. జిహెచ్‌ఎంసి నుంచి లైసెన్స్ తీసుకుని ప్రొఫెషనల్ థెరపిస్టులు లేకపోవడం, సిసిటివి కెమెరాలు, డివిఆర్ లేకపోవడం, మాసాజ్ రూములలో సిసిటివిలు లేకపోవడం వల్ల దాడులు చేశారు.
చాలా మసాజ్ సెంటర్లలో క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పాలో అర్హత ఉన్న వైద్యులు, ఫిజియోథెరపిస్టులేరు, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ నిర్వహించలేదు. పది మసాజ్ సెంటర్లపై దాడులు చేసి 34మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారిని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -