Sunday, January 19, 2025

రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. తెలుగు యాక్టర్స్ తో సహా 100మంది అరెస్టు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుతున్న సమయంలో పోలీసుల దాడి చేశారు. రేవ్ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పట్టుబడిన వారిలో 25 మందికిపైగా యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. బెంజ్ కారులో ఆంధ్రాకు చెందిన ఓ ఎమ్మెల్యే పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొని అరెస్టైన వారిలో పలువురు తెలుగు నటీమణులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News