Friday, November 22, 2024

వ్యభిచారానికి అడ్డాగా స్పాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయి, స్పా సెంటర్లు. ఇటీవలి కాలంలో పోలీసులు నగరంలోని పలు స్పా సెంటర్లపై వరుసగా దాడులు చేయడంతో ఈ విషయం బట్టబయలైంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో స్పాలు విచ్చలవిడిగా ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ చేసిన స్పాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వీటిని అలా చేయాలేదు, సులభంగా డబ్బులు సంపాదించాలని పలువురు నిందితులు స్పాలు ఓపెన్ చేస్తున్నారు. వాటిల్లో నిబంధలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేస్తూన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన స్పాలో ఎస్‌ఓటి పోలీసులు దాడులు చేయగా క్రాస్ మసాజ్ చేస్తున్న విషయం బయటపడింది. మాదాపూర్‌లో నిర్వహించిన రైడ్‌లో ఓ స్పాలో క్రాస్‌మసాజ్‌తో పాటు వ్యభిచారం చేయిస్తున్నట్లు బయటపడింది.

బంజారాహిల్స్ పోలీసులు, యాంటీ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని మేఘావి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానన్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పాపై దాడులు చేశారు. ఈ దాడుల్లో స్పాలు, మసాజ్ సెంటర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలిసింది. వీటి నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకుని వచ్చి ఇక్కడ క్రాస్ మసాజ్, వ్యభిచారం చేయిస్తున్నట్లు బయటపడింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ స్పా సెంటర్‌లో ఓ మహిళ పనికి కుదిరించి. ప్రారంభంలో మాసాజ్ చేసినా తర్వాత నిర్వాహకులు సదరు మహిళకు వ్యభిచారం చేస్తే భారీగా డబ్బులు వస్తాయని చెప్పారు.

దీనికి అంగీకరించిన మహిళ అప్పటి నుంచి వ్యభిచారం చేయడం ప్రారంభించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మహిళను ఉద్యోగం మానివేయాలని చెప్పినా వినడంలేదు. రోజు వేలాది రూపాయలు వస్తుండడంతో మహిళ వ్యభిచారం చేయడం మానివేయలేదు. దీంతో సదరు మహిళ భర్త పోలీసులను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. ఉద్యోగం కోసం చాలామంది విదేశాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలను స్పా సెంటర్ల నిర్వాహకులు వ్యభిచారంలోకి దింపుతున్నారు.

నిబంధనలు గాలికి….
స్పా, మసాజ్ సెంటర్ల నిర్వాహకులు జిహెచ్‌ఎంసి, పోలీసుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కానీ పోలీసులు దాడి చేయడంతో ఏ స్పా, మసాజ్ సెంటర్ కూడా నిబంధనలు పాటించడంలేదని బయటపడింది. స్పాలు, మసాజ్ సెంటర్లకు వచ్చే వారి ఎంట్రీ రిజిస్టర్ నిర్వహించడంలేదు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఈ సెంటర్లకు వచ్చే వారి వివరాలను రిజిస్టర్‌లో రాయడంలేదని తెలిసింది. దాడి చేసిన పోలీసులు నిర్వహకులను అరెస్టు చేసి, యువతులను రెస్కూ హోంకు తరలించారు.

స్పాలపై విమర్శలు…
స్పాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు, పోలీసులకు అన్ని తెలిసినా కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. స్పాల్లో వ్యభిచారం జరుగుతోందని అందరికీ తెలిసినా అటువైపు చూడడంలేదని విమర్శించారు. ఈ విషయం పోలీసులు దాడి చేసిన ప్రతి సారి బయటపడుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే స్పాలు వ్యభిచార కేంద్రాలుగా మారాయని ఆరోపిస్తున్నారు. అనుమతలు నుంచి నిర్వహణ వరకు పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు జాగ్రత్తగా చూడాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News