Wednesday, January 22, 2025

స్పాల్లో అసాంఘిక కార్యకలాపాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః స్పాలపై పోలీసుల దాడులు నామమాత్రంగా సాగుతున్నాయి. చాలా స్పా సెంటర్లు సరైన అనుమతులు లేకున్నా కూడా యధేచ్చగా నిర్వహిస్తున్నారు. వాటి అసలు పనులు చేయకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఇలా స్పాలు నగరంలో నిర్వహిస్తున్నారు. వాటి గురించి పోలీసులకు సమాచారం ఉన్నా కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడో ఒకసారి దాడులు చేసి కేసులు పెడుతున్నారు. ఈ నిందితులు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మరో పేరుతో దుకాణం ఓపెన్ చేస్తున్నారు. చాలా స్పా సెంటర్లకు వ్యభిచారమే ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది. దానిని ఆసరాగా చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ స్పా సెంటర్‌లో ఓ మహిళ పనికి కుదిరించి.

ప్రారంభంలో మాసాజ్ చేసినా తర్వాత నిర్వాహకులు సదరు మహిళకు వ్యభిచారం చేస్తే భారీగా డబ్బులు వస్తాయని చెప్పారు. దీనికి అంగీకరించిన మహిళ అప్పటి నుంచి వ్యభిచారం చేయడం ప్రారంభించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మహిళను ఉద్యోగం మానివేయాలని చెప్పి వినడంలేదు. రోజు వేలాది రూపాయలు వస్తుండడంతో మహిళ వ్యభిచారం చేయడం మానివేయలేదు. దీంతో మహిళ భర్త పోలీసులను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. అయినా కూడా సదరు స్పా సెంటర్‌పై దాడులు చేయలేదు, మహిళకు కౌన్సెలింగ్ ఇవ్వలేదు. మహిళ భర్త బాధ వర్ణనాతీతంగా ఉంది, తన కుటుంబాన్ని నిలపాలని కన్పించిన పోలీసును కోరాడు. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు, ఉద్యోగం కోసం చాలామంది విదేశాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలను స్పా సెంటర్ల నిర్వాహకులు వ్యభిచారంలోకి దింపుతున్నారు.

స్పాలపై విమర్శలు…
స్పాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు, పోలీసులకు అన్ని తెలిసినా కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. స్పాల్లో వ్యభిచారం జరుగుతోందని అందరికీ తెలిసినా అటువైపు చూడడంలేదని విమర్శించారు. ఈ విషయం పోలీసులు దాడి చేసిన ప్రతి సారి బయటపడుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే స్పాలు వ్యభిచార కేంద్రాలుగా మారాయని ఆరోపిస్తున్నారు. అనుమతలు నుంచి నిర్వహణ వరకు పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు జాగ్రత్తగా చూడాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News