Tuesday, December 24, 2024

ఖాజాగూడ ది కేవ్ క్లబ్లో గంజాయి కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని ఖాజాగూడలోని ‘ది కేవ్ క్లబ్’లో డ్రగ్స్ కలకలం రేగింది. వీకెండ్ నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపుదాడులు చేశారు. గంజాయి, కొకైన్ తీసుకున్న 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

క్లబ్ లో ఉన్న 55 మంది యువతీయువకులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించిన పోలీసులు.. 27 మంది గంజాయి తీసుకున్నారని నిర్థారించినట్లు తెలుస్తోంది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News