Friday, December 20, 2024

పోలీస్‌లు లక్ష్యంగా నక్సల్స్ దాచిన పేలుడు పదార్ధాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అడవుల్లో పోలీస్‌లను హతమార్చడానికి నక్సల్స్ దాచి ఉంచిన పేలుడు పదార్ధాలను, రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందిన సమాచారంతో గ్యారపట్టి పోలీస్‌లు, సెంట్రల్ రిజర్వుపోలీస్ దళాలు (సిఆర్‌పిఎఫ్) శుక్రవారం టిపగఢ్ అడవుల్లోకి వెళ్లి గాలించారని చెప్పారు. రెండు స్థానిక పేలుడు పదార్ధాలతోపాటు 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గడ్చిరోలి ఎస్‌పి నీలోత్పల్ యాంటీ నక్సల్ ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News