Wednesday, January 22, 2025

రంగారెడ్డిలో దారుణం.. వ్యక్తిని హత్య చేసి సంచిలో మూటకట్టి…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదిభట్ల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఔటర్ రింగురోడ్డు వద్ద మూటలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి.. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పై నుంచి దుండగులు విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News