Sunday, November 24, 2024

ఎస్‌పితోసహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: కస్టడీలో ఉన్న న్యాయవాదిని చిత్రహింసలకు గురించేయడమేకాకుండా అసహజ సెక్స్‌కు పురిగొల్పడం, అక్రమంగా నిబధించడం, ఆయన ప్రాణాలకు ముప్పు తీసుకురావడం వంటి ఆరోపణలపై పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తోసహా ఆరుగురు పోలీసులపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ముక్త్‌సర్ ఎస్‌పి(దర్యాప్తు) రమణ్‌దీప్ సింగ్ భుల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్‌చార్జ్, ఎన్‌స్పెక్టర్ రమణ్ కుమార్ కాంభోజ్, కానిస్టేబుల్స్ హర్బన్స్ సింవ, భూపీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్, హోం గార్డు దారా సింగ్‌పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన పోలీసుల అరెస్టు, బర్తరఫ్‌కు డిమాండు చేస్తున్న పంజాబ్, హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తమ డిమాండ్లు నెరవేరేవరకు విధులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

పోలీసు అధికారుల బృందంపై దాడిచేయడమేగాక వారి యూనిఫారాలను చింపివేశారని ఆరోపిస్తూ న్యాయవాదితోపాటు మరో వ్యక్తిని సెప్టెంబర్‌న14న సిఐఎ ఇన్‌చార్జ్ కాంభోజ్ ఫిర్యాదుపై పోలీసులు అరెస్టు చేశారు.వారిద్దరినీ జుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత వారిని పోలీసులు చిత్రహింసలకు గురించేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధిత న్యాయవాది ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కేసు నమోదు చేయాలని ముక్త్‌సర్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సెప్టెంబర్ 22న ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News