Monday, December 23, 2024

విద్వేష వ్యాఖ్యలు: శ్రీరామ సేన చీఫ్‌పై పోలీసు కేసు

- Advertisement -
- Advertisement -

హుబ్బలి: ఇతర మతానికి చెందిన ప్రజలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేసినందుకు శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌పై కేసు నమోదు చేసినట్లు కర్నాటక పోలీసులు శుక్రవారం తెలిపారు. నగర కార్పొరేషన్ సహాయ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌పై ఐపిసిలోని 153(ఎ), 295(ఎ) కింద కేసులు నమోదు చేశారు.

గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గురువారం ఈద్గా మైదానంలో ముతాలిక్ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. అంజుమాన్ ఇ ఇస్లామ్ అనే మత సంస్థ ఈద్గా మైదానంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణను వ్యతిరేకించింది. అయితే ఈద్గా మైదానంలో గణేశ్ ఉత్సవాలు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మూడు రోజుల పాటు ఈద్గా మైదానంలో గణేశ్ ఉత్సవాలు జరుపుకునేందుకు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఉత్సవాల కమిటీకి అనుమతి ంజూరు చేసింది. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు ఉత్సవాల నిర్వహణకు కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది.

గురువారం గణేశ్ నిమజ్జనిత్సోవం సందర్భంగా ఈద్గా మైదానం వద్ద ముతాలిక్ విలేకరులతో మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలను వ్యతిరేకించేవారంతా జాతి వ్యతిరేకులేనంటూ ఆరోపించారు. అంజుమాన్ సంస్థ దురుద్దేశాలు బట్టబయలయ్యాయని, దేశాన్ని విభజించడానికి ఆసంస్థ కుట్రపన్నినందని ఆయన ఆరోపించారు. మసీఉలలో సైతం గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసే సత్తా హిందూ సమాజానికి ఉందని ఆయన అన్నారు. తలచుకుంటే మసీదులలో ప్రార్థనలను కూడా అడ్డుకోగలమని ఆయన హెచ్చరించారు. రాణి చన్నమ్మ ఈద్గా మైదానంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతించకూడదని కోర్టును కోరతామని ఆయన చెప్పారు. ఇది పాకిస్తాన్ కాదని, ఇది వారి సొంత జాగీరు కాదని ముతాలిక్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News