Wednesday, January 22, 2025

ఇద్దరు కుమారుల మృతి: మరణించిన తల్లిపై హత్య కేసు

- Advertisement -
- Advertisement -

థాణె: ముంబై శివార్లలోని ఒక ఇంట్లో తల్లీ, ఆమె ఇద్దరు కుమారుల మృతదేహాలు రెండేళ్ల క్రితం లభించగా ఇప్పుడు ఆ కేసులో తల్లిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ మృతదేహాలకు సంబంధించిన పోస్టు మార్టం నివేదిక ఇటీవలే వచ్చిందని, దీని ఆధారంగా చనిపోయిన తల్లిపై హత్య కేసు నమోదు చేశామ ని ఒక పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు.

2021 సెప్టెంబర్ 7న ముంబై శివార్లలోని మీరా రోడ్డుగల నయా నగర్ వద్ద ఒక ఇంట్లో నస్రీన్ వఘూ అనే 47 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమారులు సడ్నజ్(20), మర్ష్(13) మృతదేహాలు లభించాయి. అప్పట్లో దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు.

ఇటీవలే అందిన పోస్టు మార్టం నివేదికలలో గొంతు నులమడం వల్లే ఇద్దరు పిల్లలు మరణించినట్లు, ఏవో మాత్రలు మింగి నస్రీన్ మరణించినట్లు తేలిందని ఆ అధికారి చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా నస్రీన్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ హత్యలకు కారణమేమిటో తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News