Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదం కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : గత శనివారం తెల్లవారుజామున గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి సమీపంలో రోడ్డు ప్రమాదం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉట్నూర్ డిఎస్పీ నాగేంధర్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన ఎముల పోచన్న రాంనగర్‌లోని అల్వాలే గోవర్థన్‌కు చెందిన ఆటోను అద్దెకు తీసుకొని తన కుటుంబ సభ్యులతో పాటు బాలాజీ నగర్ కాలనీకి మాడవి సోంబాయి (సలోని) కుటుంబ సభ్యులు మొత్తం తొమ్మిది మంది కలిసి శుక్రవారం రాత్రి ఇచ్చోడ మండలకేంద్రంలోని హోలీ మౌంటన్ చర్చికి ప్రార్థనల కోసం వచ్చారని తెలిపారు.

ప్రార్థనల అనంతరం శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ మేకల గండి వద్ద గుర్తు గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో నలుగురు చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తీసుకొని డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారి వెంబడి గల సీసీ ఫుటేజీలను పరిశీలించి ఇచ్చోడలోని హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీకి చెందిన లారీ ప్రమాదానికి కారణమైనట్లు నిర్థారించారు.

ఈ వాహనం శనివారం ఇచ్చోడ నుండి మహారాష్ట్ర లోని చంద్రాపూర్‌కు గ్యాస్ సిలెండర్లు తీసుకరావడానికి వెళ్తున్న క్రమంలో అతీవేగంగా ఆటోను ఢీ కొనడంతో ప్రమాదం స్థంభవించిందని తెలిపారు.ప్రమాద అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని చంద్రాపూర్ తీసుకెళ్లీ ప్రమాదంలో లారీ బంపర్ ధ్వంసం కాగా మరోక బంపర్ వేయించి గుర్తు పట్టకుండా కలర్ వేయించడాని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ( టిఎస్ 01 యుసి 4400) స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్ చట్ల చంద్రకాంత్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ నాగేంధర్ తెలిపారు. సీసీ ఫుటేజీల సాంకేతిక ద్వారానే ఈ కేసును త్వరితగతిన చేదించినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఇచ్చోడ సీఐ గుడిహత్నూర్, ఇచ్చోడ, సిరికొండ , నేరెడిగొండ ఎస్సైలు ఎల్. ప్రవీణ్ కుమార్, శ్రీ కాంత్, నీరేష్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News