Sunday, December 22, 2024

సింఘు, తిక్రి సరిహద్దుల్లో అవరోధాల తొలగింపు

- Advertisement -
- Advertisement -

పాదచారుల సౌలభ్యానికి పోలీసుల చర్య
‘ఢిల్లీ చలో’ను నిలిపివేసిన రైతులు

న్యూఢిల్లీ : దేశ రాజధానికి తమ సంకల్పిత పాదయాత్రను రైతులు నిలిపివేయడంతో సింఘు, తిక్రి సరిహద్దుల్లో రోడ్లపై అవరోధాలలో కొంత భాగాన్ని ఢిల్లీ పోలీసులు ఆదివారం తొలగించి పాదచారుల ప్రయాణానికి మార్గం ఏర్పాటు చేశారు. ‘వాహనదారుల కోసం పాయింట్ ఎ నుంచి పాయింట్ బి వరకు అవరోధాలలో కొన్ని తొలగిస్తున్నాం. మోహరించిన పోలీసులు, పారా మిలిటరీ దళాలు 24 గంటలూ నిఘా వేసి ఉంచుతాయి. బలగాల మోహరింపు కొనసాగుతుంది. వాహనాల రాకపోకలకు ప్రస్తుతానికి అనుమతి ఉండదు’ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

సింఘు, తిక్రి సరిహద్దుల్లో ఒక చిన్న మార్గాన్ని ఉపయోగించుకుంటూ ఢిల్లీ వైపు నడిచేవారి కోసం రెండు భారీ సిమెంట్ అవరోధాలను నగర పోలీసులు ఆదివారం తొలగించారు. నగరంలోని సింఘు, తిక్రి, ఘాజీపూర్ సరిహద్దు కేంద్రాల వద్ద మోహరించిన భద్రత సిబ్బందిని అప్రమత్తంగా ఉండవలసిందిగా ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర సంస్థ), కిసాన్ మజ్దూర్‌మోర్చా ‘ఢిల్లీ చలో’ పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News