Tuesday, April 1, 2025

అగ్నిప్రమాదంలో వృద్ధమహిళను , జాగిలాన్ని రక్షించిన పోలీస్‌లు

- Advertisement -
- Advertisement -

దక్షిణ ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇరుక్కున్న 70 ఏళ్ల వృద్ధమహిళను, ఢిల్లీ పోలీస్‌లు సాహసించి రక్షించ గలిగారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఏమాత్రం కదల లేని ఆస్వస్థురాలై ఉంది. ఆమె కుంటి ఎముక దెబ్బతినడంతో మంచంపై నే ఉంది. దీనికి తోడు మంటల నుంచి వచ్చిన పొగ గదిలో కమ్ముకుని ఊపిరాడడం లేదు. ఆమె కుమారునితోపాటు పోలీస్‌లు సాహసించి ఆ గది నుంచి వేరే గదికి తరలించ గలిగారు. ఆ ప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న జాగిలాన్ని కూడా రక్షించగలిగారు. ఆ జాగిలానికి సిపిఆర్ చికిత్స అందించారు. ఆ తరువాత ఆ జాగిలాన్ని డిఫెన్స్ కాలనీ ఏరియాలో వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News