Friday, April 4, 2025

రైల్వే స్టేషన్‎లో కిడ్నాపైన బాలుడిని కాపాడిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police rescue kidnapped boy in Secunderabad

హైదరాబాద్: కిడ్నాప్‌కు గురైన గంటలోపే హైదరాబాద్ పోలీసులు ఓ బాలుడిని కిడ్నాపర్ల నుంచి రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ తన తల్లి నుండి ఏడాది వయస్సు గల బాలుడిని కిడ్నాప్ చేసి, ఆ ప్రాంతం నుండి ఆటోలో తప్పించుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కిడ్నాపర్ ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడైంది. అనంతరం కిడ్నాపర్ ఆటో వెళుతున్న దారిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసులు సమాచారం అందించారు. కవాడిగూడ వద్ద కిడ్నాపర్‌ ఆటోను పోలీసులు అడ్డుకుని చిన్నారిని రక్షించారు. అనంతరం పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News