హైదరాబాద్: కుటుంబంలో ఆస్తుల తగాదాల వల్ల విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆసిఫ్‌నగర్ పోలీసులు కాపాడారు. ఈ సంఘటన నగరంలోని రేతిబౌలిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని రేతిబౌలి, షాలీమర్ స్వీట్ హౌస్‌కు చెందిన రాధ తన భర్తతో కలిసి ఉంటోంది. కుటుంబంలో గత ఐదురోజుల నుంచి ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాధ భర్త జీవితంపై విరక్తి చెందిన ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తియకపోవడంతో రాధ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు పిసిలు హరీష్, సంతోష్‌కుమార్, హోంగార్డు సురేష్, ప్రొబేషనరీ ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే గది డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే బాధితుడు ఉరివేసుకుని అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే కిందికి దించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితుడికి చికిత్స చేయిస్తున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -