Wednesday, January 22, 2025

కొత్త ఏడాది వేడుకలకు పోలీసుల ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేవారు పది రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ నిర్ధేశించిన సమయం వ రకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు. పబ్బుల్లో, ఈ వెంట్లలో అశ్లీల నృత్యాలు, ఎక్కువగా సౌండ్ పెడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పబ్బుల్లోకి మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవెంట్స్ నిర్వహించే ప్రాంతంలో మొత్తం కవర్ అయ్యేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈ వెంట్స్, పబ్బుల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. సామర్థ్యం కంటే ఎక్కు ఈవెంట్స్ పాస్‌లు ఇవ్వవద్దని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పబ్బులు ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసిన యాజమాన్యం వారే బాధ్యత వహించాలని తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న వారు ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ఈ బాధ్యత నిర్వాహకులదేనని పేర్కొన్నారు.స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్‌లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చే యాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వా రిపై కేసులు నమోదు చేస్తామని, జరిమానా రూ. 10,000, ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని స్పష్టం చ శారు.
క్యాబ్, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి
నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేవారు గొడవ లు, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు జరిగినా వారే బా ధ్యత వహించాలి. ఆయుధాలతో ఎవరిని అనుమతించవద్దని, వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌక ర్యాం కల్పించాలి. ఈవెంట్ జరిగే ప్రాంతానికి వెళ్లేవారు లైన్‌లో వెళ్లేలా చూడాలి, తల్లిదండ్రులతో వచ్చే మైనర్లను మాత్రమే అనుమతించాలి. ఎవరూ వేడుకల వద్దకు డ్రగ్స్, గంజాయి తీసుకుని రాకుండాచూడాలి.
తాగి నడిపితే వాహనం సీజ్
వేడుకల్లో పాల్గొన్న వారు మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తెల్లవారి వచ్చి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించిన త ర్వాతే వాహనాన్ని ఇస్తారు. మద్యం తాగి వాహనాన్ని నడిపిన వారి లైసెన్స్‌ను 3 నెలలు సస్పెండ్ చేస్తారు. బైక్‌లకు సైలెన్సర్లను మార్చిన వారిపై చర్యలు తీసుకుంటారు. పబ్లిక్ ప్లేస్‌లో ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, రేసింగ్‌కు పాల్పడితే ఎంవి యాక్ట్ 183,184 కింద కేసు నమోదు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News