Monday, December 23, 2024

కేబుల్ బ్రిడ్జిపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

దుర్గం చెరువుపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి వద్ద ఆంక్షలు విధిస్తూ మాదాపూర్ డిసిపి వినీత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు. వరుసగా కేబుల్ బ్రిడ్జిపై సంఘటనలు జరగడంతో సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. బ్రిడ్జిపై వాహనాలు నిలపడం, ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించారు. కేబుల్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన గ్రిల్స్, రేయిలింగ్‌పై కూర్చోవడం, బ్రిడ్జిపై నడవడం నిషేధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News