Thursday, January 23, 2025

నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన 18నెలల చిన్నారి సేఫ్..

- Advertisement -
- Advertisement -

Police save kid after kidnaped from Niloufer Hospital

హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన 18నెలల చిన్నారిని నాంపల్లి పోలీసులు కాపాడారు. బుధవారం ఉదయం నిలోఫర్ ఆసుపత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తాపూర్ కల్లు కాంపౌండ్ దగ్గర నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని కాపాడారు. కిడ్నాప్ అయిన నాలుగు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. సీసీటీవీ పూటేజి ఆధారంగా చిన్నారిని క్షేమంగా కాపాడి తల్లిదండ్రుల అప్పటించినట్లు పోలీసులు తెలిపారు.

Police save kid after kidnaped from Niloufer Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News