Friday, December 20, 2024

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు..

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట ః కుటుంబ కలహాలతో ఓ వివాహిత  బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న బ్లూకోట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బిజిగిర్‌షరీఫ్ గ్రామానికి చెందిన పుప్యాల శ్రీలత కుటుంబ కళహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుని

గ్రామంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద కూర్చుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న  బ్లూకోట్ పోలీసులు శ్రీలతను సముదాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం జరిగిందని అన్నారు. శ్రీలత కుటుంబ సభ్యులకు పోలీస్ స్టేషన్ పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు.

బ్లూకోట్ పోలీసులకు అభినందన వెల్లువ
జమ్మికుంట మండలంలోని బిజిగిర్‌షరీఫ్ గ్రామానికి చెందిన పుప్యాల శ్రీలత అనే వివాహిత మహిళ కుటుంబ కలహాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా సమాచారం అందుకున్న బ్లూకోట్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సారంగధర, హోమ్‌గార్డులు జలీల్, ఆనంద్‌లను సీఐ రమేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News