Monday, March 3, 2025

సైనిక్ స్కూల్ తరహాలోనే పోలీస్ స్కూల్ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

విద్యా విధానంలో కొత్త ఒరవడి తీసుకురావాలి
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్
ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: సైనిక్ స్కూల్ తరహాలోనే పోలీస్ స్కూల్ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని, విద్యా విధానంలో కొత్త ఒరవడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యాభ్యాసం అందించేందుకు ఉద్దేశించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో స్కూల్ బ్రోచర్, (ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి https://yipschool.in వెబ్‌సైట్‌ను) సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్కూల్ విద్యార్థుల కోసం సిద్ధం చేసిన యూనిఫాం నమూనాలను సిఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
దరఖాస్తులకు అవకాశం ఇలా

2025,-26 విద్యాసంవత్సరానికి 1 నుంచి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్కూల్ లో 50 శాతం పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించనున్నారు. అధికార వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు 90591 96161 నెంబర్‌లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

విద్యార్థులకు శాటిలైట్ ఆధారిత విద్య

కాగా, రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి గతేడాది అక్టోబర్ 21 న సిఎం శంకుస్థాపన చేశారు. పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూల్స్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో దీని నిర్మాణం జరుగుతుండగా, 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ సూళ్ల నిర్మాణానానికి సంబంధించి భూమి వివరాల సేకరణ పూర్తి కాగా, త్వరలోనే వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక్కడ చదివే విద్యార్థులకు శాటిలైట్ ఆధారిత విద్యను అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News