- Advertisement -
అలనాటి మేటి నటి జయప్రద కనిపించడం లేదు. పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిజమే… కానీ అసలు సంగతి ఏమిటంటే… లోక్ సభ ఎన్నికల సమయంలో నిబంధనలను అతిక్రమించారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసులో రాంపూర్ కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే పలు దఫాలుగా జయప్రద విచారణకు గైర్హాజరవుతున్నారు. దీనిపై సీరియస్ అయిన కోర్టు జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
డిసెంబర్ లో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అయినా ఆమె లెక్కచేయకపోవడంతో, కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ జయప్రదను జనవరి 10న హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయితే ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా జయప్రద తానెక్కడ ఉన్నదీ వెల్లడించకపోవడం గమనార్హం.
- Advertisement -