Saturday, January 4, 2025

రాంగోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు… స్పందించిన ఆర్‌జివి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతం వీడాడు. సంవత్సరం కింద తాను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసులు పెడుతున్నారని తెలిపారు. ఒకే రోజు నాలుగు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  తాను ఎవరిపై ట్వీట్లు చేశానో వారి మనోభావాలు దెబ్బ తినకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బ ఎలా తింటాయని అడిగారు. దీనికి కేసులు ఎలా వర్తిస్తాయా తన అర్థం కావడం లేదని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.

ఎపి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహం సినిమాలో భాగంగా టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. దీంతో ఈ పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌జివిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని తెలిపారు. విచారణ హాజరుకాకపోవడంతో ఆర్‌జివి అరెస్టు చేసేందుకు పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వర్మ వీడియో విడుదల చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News