Thursday, January 23, 2025

మధుయాష్కీ గౌడ్ నివాసంలో అర్థరాత్రి పోలీసుల సోదాలు..

- Advertisement -
- Advertisement -

అర్థరాత్రి ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై పోలీసుల దాడులు చేశారు. హయత్ నగర్ లోని మధుయాష్కీ నివాసంలోకి మంగళవారం అర్థరాత్రి చొరపడిన పోలీసులు… ఆరు గంటలుగా సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలపై మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు నిర్వహిస్తారని మధుయాష్కీ పోలీసులను ప్రశ్నించారు.

పోలీసుల దాడి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా మధుయాష్కీ నివాసానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోదాల పేరుతో కాంగ్రెస్ అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News