Wednesday, January 15, 2025

నేడు బిగ్‌బాస్‌ ఫైనల్.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 8 సీజన్ ఆదివారం ముగినుంది. ఇవాళ రాత్రి నాగార్జున విజేతను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గతేడాది బిగ్‌బాస్‌ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

షోలో గెలుపొందిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చిన అతను.. అప్పటికే భారీగా అక్కడికి చేరుకున్న అభిమానులతో ర్యాలీ తీసుకుందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో పలు అర్టీసి బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News