Sunday, January 19, 2025

కట్టుదిట్టమైన భద్రత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీ బ్యూరో : పా ర్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జ రిగేందుకు పటిష్టమైన భద్రతను ఏ ర్పాటు చేశామని డిజిపి రవిగుప్తా తె లిపారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లపై ఆయన ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. రా ష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో జరగనున్న ఎన్నికలను స్వే చ్ఛగా,నిష్పక్షపాతంగానిర్వహించేం దుకు విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్‌సమయంలో ఎలాంటి శాం తి భద్రతల సమస్య ఏర్పడకుం డా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తె లిపారు. ఎన్నికల భద్రతకు 73, 414 సివిల్ పోలీసులు, 500 రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పోలీసులు, త మిళనాడుకు చెందిన మూడు స్పెష ల్ ఆర్మ్‌డ్ కంపెనీలు, 2,088 ఇతర శాఖల సిబ్బంది. 7,000 మంది ఇ తర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులను వినియోగిస్తున్నామని తెలిపా రు. ఎన్నికల నియమావళి అమలు లో భాగంగా రాష్ట్ర పోలీసులు భద్ర తా తనిఖీ కేంద్రాల నెట్వర్క్‌ను ఏ ర్పాటు చేశామని తెలిపారు. ఇందు లో 482 ఫిక్స్‌డ్ స్టాటిక్ టీములు (ఎఫ్‌ఎస్‌టి),

462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టి), 89 ఇంటర్ -స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్లులు, 173 ఇంటర్-జిల్లా చెక్ పోస్ట్లులు ఏర్పాటు చేశామని తెలిపారు. డబ్బు, మద్యం, ఇతర అక్రమ పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు మొబైల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 2024 మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు రూ. 186.14 కోట్ల మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన వస్తువులను జప్తు చేశారన్నారు. రాష్ట్ర పోలీసులు ఎక్సైజ్ చట్టం, మాదకద్రవ్యాల చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 8,863 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎన్నికల్లో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి 34,526 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
రూ.93 కోట్లు సీజ్…
తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు చేసిన తనిఖీల్లో రూ.93,94,43,358 నగదు సీజ్ చేశామని డిజిపి రవిగుప్తా తెలిపారు. మద్యం, 10,07,49,567 కోట్లు, డ్రగ్స్ రూ.7,86,32,020, బంగారం 91.822 కిలోలు, వెండి 166.037 కిలోలు, రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచేందుకు తీసుకుని వెళ్తున్న వస్తువులు రూ.11,48,88,459 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 186,14,90,884 విలువైన వాటిని సీజ్ చేశామని తెలిపారు.
డిజిపి కార్యాలయంలో కంట్రోల్ రూమ్…
ఎన్నికల కోసం డిజిపి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇది ఈ నెల 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. చివరి ఈవిఎం స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది కోసం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News