Thursday, January 23, 2025

బర్రెలక్కకు భద్రత కల్పించండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యర్ధుల భద్రత ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకే భద్రత కల్పిస్తే సరిపోదని వ్యాఖ్యానించింది.

తన సోదరుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని బర్రెలక్క తనకు భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులను కోరినా భద్రత కల్పించట్లేదని ఆమె ఫిర్యాదు చేసింది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.

బర్రెలక్క పిటిషన్ ను శుక్రవారం విచారణకు చేపట్టిన హైకోర్టు… ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆమెకు భద్రత కల్పించాలని ఆదేశించింది. ప్రచార సమయంలోనూ భద్రత కొనసాగించాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News