Wednesday, March 19, 2025

100 కోట్ల విలువైన బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఎటిఎస్ పోలీసులు, డిఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఏకంగా 100 కిలోల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌లో దాని విలువ 100 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. భారీ ఎత్తన బంగారం అక్రమ రవాణ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. పాల్ది ప్రాంతంలోని ఆవిష్కార్ అపార్ట్‌మెంట్‌లో ఎటిఎస్ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించగా.. 88 కిలోల బ్లంన 19.66 కిలోల ఆభరణాలు పట్టుకున్నారు. ఈ ఇల్లు గాంధీనగర్‌లోని ఓ వ్యక్తి పేరు మీద ఉంది. అతను ఆ ఇంటిని మహేంద్ర షా అనే స్టాక్‌ మార్కెట్ ఆపరేటర్‌కు అద్దెకు ఇఛ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి అక్రమం తీసుకువచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News