Monday, December 16, 2024

దర్శన్ కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

చిత్రదుర్గ(కర్నాటక): రేణుకా స్వామి హత్య కేసును పోలీసు బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడ కీలక నిందితులు. హతుడిని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరైన రవి ఆ కారును చిత్రదుర్గ జిల్లాలోని అయ్యనహల్లి గ్రామంలోని ఇంటి వద్ద పార్కింగ్ చేశాడు.

ఆ కారును స్వాధీనం చేసుకున్నప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ ఉన్నారు. పోలీసులు రవి కుంటుంబాన్ని ప్రశ్నించి, కారు నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు దర్శన్, పవిత్ర సహా 15 మందిని అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News