- Advertisement -
హైదరాబాద్: నగరంలో వినూత్న రీతిలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని పరుపుల్లో పెట్టి తరలిస్తున్న ఆటోను మాదాపూర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశాలోని బలిమెల నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి ఆటోను పోలీసులు తనిఖీలు చేశారు. పరుపులు విప్పి చూడగా 81 కిలోల గంజాయి లభ్యమయింది. కొత్త పరుపులు కొని వాటిలో స్పాంజ్ తీసేసి గంజాయి ప్యాకింగ్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -