సిటీ బ్యూరోః అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, మద్యం స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ ౩౦ వ తేదీన జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్ , ఓటర్లను ప్రలోభ పెట్టె ఇతర వస్తువు పై పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. అక్టోబర్ 9 వ తేది నుండి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, మద్యం తదితర వస్తువులను సీజ్ చేశారు.
రూ. 4.2 కోట్లు విలువ చేసే 7.706కిలోల బంగారం, రూ. 8.77 లక్షల విలువ చేసే 11.700కిలోల వెండి, రూ. 5.1 కోట్ల నగదు, 110 లీటర్ల మద్యం, 23 మొబైల్ ఫోన్స్, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , టాస్క్ ఫోర్స్ , ఇతర విభాగాల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చర్యలు చేపట్టారు. ప్రజలు అందరు కూడా తమ ప్రాంతాలలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే తమకు సమాచారం అంద చేయాలని పోలీసులు కోరారు.