Monday, January 20, 2025

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్‌ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.95,000 ఉంటుంది.

పోలీసుల కథనం ప్రకారం…జీడిమెట్ల, సుభాష్‌నగర్‌కు చెందిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు పిడిఎస్ రైస్‌ను పలువురి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు నిల్వ చేశాడు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. బియ్యం నిల్వ చేసిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News