Thursday, November 21, 2024

భారీగా హవాలా నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదును మంగళవారం సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అఫ్జల్‌గంజ్ పిఎస్, బేగంబజార్‌లో రూ.50లక్షలు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.18లక్షలు పట్టుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమ నగదును తరలించకుండా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంబజార్‌లో సోమవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. బేగంబజార్‌లోని కుమార్ జువెల్లర్స్ యజమాని కుమార్(30) రాత్రి షాపును మూసివేసిన తర్వాత రూ.50లక్షలను తీసుకుని గౌలిగూడలోని ఇంటికి బయలుదేరాడు.

ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు, బ్యాగులో రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరగా చూపించలేకపోయాడు. దీంతో నగదును సీజ్ చేసిన పోలీసులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు అఫ్జల్‌గంజ్ ఇన్స్‌స్పెక్టర్ లింగేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా వాహనంలో తరలిస్తున్న రూ.18లక్షలు పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న వ్యక్తిని లెక్క చూపించాల్సిందిగా కోరగా చూపించలేకపోయాడు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News