Wednesday, November 6, 2024

తెలంగాణలో ఎన్నికల కోడ్.. నార్సింగిలో భారీగా డబ్బు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర శివారు నార్సింగిలో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు, పోలీసులు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు తెరలేపారు. ఈ క్రమంలో మంగళవారం నార్సింగిలో కారులో తరలిస్తున్న రూ.88 లక్షలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో పోలీసులు తనిఖీలో 16 కిలోల బంగారంతో పాటు 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఇక, చందానగర్‌లో 6 కేజీల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News