Tuesday, November 26, 2024

పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆరు కేజీల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల జోరుగా కొనసాగుతున్న వేళ.. అదే అదనుగా స్మగ్లర్లు చెలరేగిపోయేందుకు యత్నించా రు. దాదాపు రూ.4.31 కోట్ల విలువ చేసే 6 కిలోల బంగారాన్ని నగరంలోకి తరలించాలని భావించారు. కానీ డిఆర్‌ఐ పోలీసులు చాకచక్యంగా ముందే ఆ విషయాన్ని పసిగట్టి కారులో తనిఖీలు చేసి, నలుగురు నిందితులు అరెస్టు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చౌటు ప్పల్‌లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. రోడ్లపై బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన వాటిని పట్టుకునేందుకు డిఆర్‌ఐ విజయ వాడ-హైదరాబాద్ హైవేపై ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్ చేసింది. చౌటుప్పల్‌లోని లింగోజీ గూడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కోల్‌కతా నుంచి నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును అధికారులు ఆపారు.

వాహనంలో ఉన్న వారిని ప్రశ్నించడంతో పాటు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 35 బంగారు కడ్డీలు ముక్కలు సుమారు 5.964 కిలోల బరువున్న వాటిని స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ సుమారు రూ.4.31 కోట్లు ఉంటుందని అంచనా. కారులో రహస్య ప్రదేశంలో ఈ బంగారాన్ని ఉంచి వారు ప్రయాణి స్తున్నారు. దీంతో పోలీసులు ఆ వాహనంలో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని 1962 కస్టమ్స్ చట్టంలోని నిబంధనలు ప్రకారం వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News