Monday, April 7, 2025

పోలీసుల సేవలు ఎనలేనివి :మాధవరం

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఐడిఎల్ లేక్ సమీపంలో సోమవారం కూకట్‌పల్లి పోలీసుల ఆధ్వర్యంలో తలపెట్టిన 2కె రన్‌ను కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి పోలీసులు శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ నిరంతరం ప్రజల అందుబాటులో ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి ఏసిపి చంద్రశేఖర్, సిఐ సురేందర్ గౌడ్, జిహెచ్‌ఎంసి డిసిలు రవీ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News