Saturday, November 16, 2024

హత్య కేసును ఛేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

వేల్పూరు మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయి కనబడడం లేదని భార్య జమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన వేల్పూరు పోలీసులు ఎట్టకేలకు నిందితులను ఆరెస్టు చేసి రిమాండ్ తరలించారు. సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను విచారించగా పథకం ప్రకారమే రంజిత్ భార్య జమునతో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో కర్ర సహాయంతో దాడి చేసి హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా అక్కడే పూడ్చి పెట్టిన నిందితులు హత్య నేరాన్ని ఒప్పుకున్నట్లు ఆర్మూర్‌ఎసిబి ప్రభాకర్ రావు వెల్లడించారు.

వేల్పూరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ… వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ నిత్యం తాగుడుకు బానిసగా మారి భార్య జమున అక్రమ సంబంధం పెట్టుకున్న నాగేష్ ఆమె తండ్రి గంగారాం అలాగే పెద్ద కొడుకుతో కలిసి పథకం ప్రకారం రంజిత్‌ను ఎలాగైనా హత్య చేయాలని ఉద్దేశ్యంతో వ్యవసాయ క్షేత్రంలో మృతుడు రంజిత్‌కుమార్‌కు అతిగా మద్యం తాగించి అక్టోబర్ 20వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో రంజిత్ తలపై కర్రల సాయంతో బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు ఆ తర్వాత అక్కడే ఉన్న మామిడి చెట్ల పొదలలో గడ్డపార పావుడ సహాయంతో గోతిని తవ్వి పూడ్చి పెట్టి ఎవరికి అనుమానం రాకుండా చేసినట్లు వివరించారు.

హత్య చేసిన తర్వాత అక్టోబర్ 24వ తేదీన నిందితురాలైన మృతుని భార్య జమున వేల్పూరు పోలీసు స్టేషన్‌ను వచ్చి తన భర్త రంజిత్‌కుమార్ కనబడడం లేదని చిన్న గొడవ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయారని మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసిందని అన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టగా మృతుని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా వారు మాట్లాడిన ముగ్గురిని అనుమానితులుగా అరెస్టు చేసి విచారించగా అత్యానేరాన్ని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

వారి వద్ద నుండి ఒక బైకు మూడు సెల్‌ఫోన్లు హత్యకు ఉపయోగించిన వస్తువులు పారా, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా వ్యవహరించి తొందరలోనే కేసును చేధించిన ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి వేల్పూర్ ఎస్సై వినయ్‌కుమార్, ఎఎస్సై యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుళ్లు శ్రావణ్, భరత్, సతీష్, శ్రీనివాస్, ధర్మేందర్ రాజు నాయక్‌లను ఆర్మూర్ ఎసిపి ప్రభాకర్ రావు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News