Saturday, November 23, 2024

బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: మౌలాలి సప్తగిరి కాలనీకి చెందిన బాలుడు కిడ్నాప్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో బాధిత బాలుడుని రక్షించి, కారకులైన నలుగురి నిందుతులను పోలీసు లు అరెస్ట్ చేశారు. రాచకొండ జాయింట్ సీపీ వి.సత్యనారాయణ, మల్కాజిగిరి జోన్ డీసీపీ దరవాత్తు జానకీ సంబంధిత వివరాలను శనివారం విలేకరులకు వెల్ల్లడించారు. మౌలాలి సప్తగిరి కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగులు సుంకేశుల శివ (22), తన సమీప బం ధువు సుంకేశుల రవి (24)లు అన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో నష్ట పోయారు. అది చాలదన్నట్లుగా తెలిసిన వారి వద్ద నుంచి మరో రూ 4 లక్షల వరకు అప్పు చేశాడు.

చేసిన అప్పులు తీర్చ లేక పోవడం, షేర్ మార్కెట్‌లో కోల్పోయిన ఆ డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించాలనే దురాశతోనే సుంకేశుల శివ , రవితో కలిసి చిన్నపిల్లను కిడ్పాప్ చేసి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. వీరితో పాటు నాచారం బాబానగర్‌కు చెందిన పసిక మహిపాల్ (25), మౌలాలి సప్తగిరి కాలనీకి చెందిన కటుకూరి దీలీప్ (22)కు ఒక్కొక్కరికి రూ 20 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ ప్లాన్‌లో భాగంగా సప్తగిరి కాలనీలోనే శివ నివాసానికి అనుకుని ఉన్న కాంట్రాక్టర్ రూపినేని శ్రీను కుమారుడు హర్షవర్ధన్ (13) మల్కాజిగిరి సెయింట్ ఆన్స్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడిని కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. ఈ బాలుడి కిడ్నాప్‌కు రెండు రోజులు ముం దు నిందుతులు బాలుడి ఫోటోను షేర్ చేసుకొని, రెక్కి నిర్వహించారు.

ఈ నెల 15వ తేది సాయంత్రం బా ధిత బాలుడు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంటి ముందు ఆడుకోవడానికి వచ్చిన సమయంలో సుంకేసుల రవి, ఆడుకోవడానికి బంతిని కొనిస్తానని ఆ బాలుడిని నమ్మించి కారులో ఉన్న మరో ఇద్దరు నిందుతుల వద్దకు తీసుకుని వెళ్లాడు. కారులో ఉన్న నిందుతులు పసకి మహిపాల్ , కట్కూరి దిలీప్‌లు బాధిత బాలుడిని తమ కారులో ఎక్కించుకొని తార్నాక మీదుగా మహబూబాబాద్ సమీపంలోని నర్సింహులు పేట గ్రామానికి తీసుకు వెళ్లారు. అనంతరం నిందుతులు కిడ్నాప్ చేసిన బాలుడి తండ్రికి ఫోన్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేశామని, విడుదల చేయడానికి తమకు రూ 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీలకు చెప్పవద్దని, చెబితే బాలుడిని చంపేస్తామని బెదిరించారు. అయితే అంతకు ముందే బాలుడి తండ్రి శ్రీనివాస్ మల్కాజిగిరి పోలీసులకు ఫి ర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ పర్యవేక్షణలో జాయింట్ సీపీ వి. సత్యనారాయణ, మల్కాజిగిరిజోన్ డీసీపీ డి.జానకీ నేతృత్వంలో సమాచారం అందుకున్న పోలీసులు మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో నిందుతులు వరంగల్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసు బృంధాలుగా ఏర్పడి పాలకుర్తికి వెళ్లి నిందుతులును పట్టుకుని, బాలుడిని రక్షించారు. నిందుతుల నుంచి స్విఫ్ట్ కారు , 5 మొబైల్‌ఫోన్‌లు, కత్తి, స్క్రూడ్రైవర్, ప్లాస్టిక్ రోప్స్ ను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. 36 గంటల్లోనే కేసును చేధించి, సురక్షితంగా బాలుడిని క్షేమంగా ఇంటికి చేర్చిన మ ల్కాజిగిరి డీసీపీ (ఎస్‌ఓటి) గిరిధర్, పి.ఏసీపీ నరేష్‌రెడ్డి, మల్కాజిగిరి సిఐ రవికుమార్, ఉప్పల్ ఎస్‌హెచ్‌ఓ ఆర్. గోవింద్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీరాములును ఈ సందర్భం గా మల్కాజిగిరి జోన్ ఎస్‌ఓటి పోలీసులను రాచకొండ పోలీసుల కమిషనర్ డిఎస్ చౌహన్, జాయింట్ సీపీ వి.సత్యనారాయణ, మల్కాజిగిరి జోన్ డీసీపీ దరవాత్తు జానకీలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News