Wednesday, January 22, 2025

గంజాయికి బానిసై.. సైకోగా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురిచేసిన సైకో కిల్లర్‌ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వరుస హత్యల కేసును చాలా త్వరగా ఛేదించారు. సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేశారు. ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన జంట హత్య స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో రెండు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దుప్పట్లు విక్రయిస్తున్న వ్యక్తి, రోడ్డు పక్కనే ఉన్న దుకాణం ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గ్రానైట్‌ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సీరియల్ కిల్లర్ హైదరాబాద్‌లోని నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్ ప్రాంతాల్లో సంచరిస్తూ వరుస హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని టార్గెట్ గా చేసుకుని చంపేస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఇద్దరిని హత్య చేసిన నిందితుడు… ఈ నెల 7న రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. గంజాయికి అలవాటు పడిన వారు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారు. నిందితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News