Monday, December 23, 2024

ఆపదలో ఉన్నవారికి అండగా పోలీసులు

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తిః ఆపదలో ఉన్నవారికి పోలీసులు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌కు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే స్పందించి పరిష్కారించాలని సూచించారు.

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ రేట్ చాలా తక్కువగా నమోదు కావడం జరిగిందన్నారు. గత సంవత్సరంలో హత్య కేసులు , దొంగతనలు, రోడ్డు ప్రమాదలు, ఇతర కేసులు మిగతా పోలీస్ స్టేషన్‌లో కంటే చాలా తక్కువగా నమోదు కావడం జరిగిందన్నారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 326,307 కేసులు తప్ప మిగతా పెద్ద కేసులు నమోదు కాలేవన్నారు.

జిల్లాలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి వెల్దుర్తి మండలం నుండి అధిక సంఖ్యలో బాధితుల సమస్యల ఫిర్యాదులు రావడం లేదన్నారు. స్థానిక పోలీస్‌ల పనితీరు బాగుందని, ఎస్‌ఐ మాదుసూధన్‌గౌడ్‌ను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News