Sunday, January 12, 2025

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీకి టీషర్ట్స్ వేసుకుని వచ్చిన గులాబీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేవంత్, అదానీ దోస్తానా అంటూ రాసిన ఉన్న టీషర్ట్స్ ధరించి రావడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారిని లోపలకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేస్తూ అక్కడే నిరసనకు దిగడంతో పోలీసులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News