Tuesday, July 2, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటకి రాగా ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరి ల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడం జరిగింది.

ఇందులో హార్డ్ డిస్క్‌లు, సిడి, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. ఫైనల్‌గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడో రి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. అనంతరం మాజీ అడిషనల్ ఎస్‌పిల బెయిల్ పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగా, బుధవారం తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్‌లపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News