చెన్నై: తమిళ సినీ నటి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రాజకీయ నేత సీమన్‌కు చెన్నై పోలీసులు నోటీసులిచ్చారు. శనివారం ఉదయం 10.30 గంటలకు వలసరవాకం పోలీసు స్టేషన్‌కు రావాలంటూ సీమాన్‌ను పోలీసులు ఆదేశించారు.
తమిళ జాతీయవాద రాజకీయ పార్టీ నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టికె) వ్యవస్థాపకుడైన సీమన్ తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమన్‌పై నాలుగు పేజీల ఫిర్యాదును చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి విజయలక్ష్మి అందచేశారు.
పెళ్లి చేసుకుంటానని తనకు వాగ్దానం చేసిన సీమన్ మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె తన పిర్యాదులో ఆరోపించారు. సీమాన్‌తో కలసి అనేక చిత్రాలలో ఆమె నటించారు. సీమాన్‌పై తాను 2011లోనే ఫిర్యాదు చేశానని, అయితే పెళ్లి చేసుకుంటానని ఆయన వాగ్దానం చేయడంతో ఆ ఫిర్యాదును వాపసు తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. హనుమాన్ జంక్షన్, ఫ్రెండ్స్(తమిళ్)తోపాటు అనేక తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2013లో కల్యవళిని పెళ్లి చేసుకున్న సీమన్‌కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.