Monday, December 23, 2024

పోకిరీ పోలీసు…. బాలిక వెంటబడి వేధింపు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: ఒక స్కూలు విదార్థిని వెంటబడి వేధిస్తున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ట్విట్టర్‌లో విస్తృతంగా పంపిణీ అయిన ఈ వీడియోలో ఖాకీ యూనిఫారమ్ ధరించిన ఒక వ్యక్తి స్కూటర్‌పై వెంబడిస్తూ సైకిల్‌పై వెళుతున్న ఒక పాఠశాల విద్యార్థినిని వేధించడం కనిపిస్తోంది.

Also Read: అనుమతి ఇస్తే ఓటర్ల కోసం డ్యాన్సులు, మద్యం: ఇసికి అభ్యర్థి లేఖ

ఆ వ్యక్తిని మరో మహిళ, వీడియో షూట్ చేస్తున్న వ్యక్తి అనుసరించారు. పోలీసు కానిస్టేబుల్‌గా కనిపిస్తున్న ఆ వ్యక్తిని ఆ మహిళ అడ్డుకుని వాహనం నంబర్ ఏమిటని నిలదీయడం, ఇది ఎలెక్ట్రిక్ వాహనం కాబట్టి నంబర్ ఉండదని ఆ వ్యక్తి బవాబివ్వడం వీడియోలో కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలో ప్రతిరోజు అమ్మాయిల వెంటబడి ఎందుకు వేధిస్తున్నావంటూ ఆ ఆ మహిళ ఆ హెడ్ కానిస్టేబుల్‌ను గట్టిగా నిలదీశారు. అందుకు ఆ హెడ్ కానిస్టేబుల్ దురుసుగా సమాధానం ఇవ్వడం వీడియోలో చూడవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియపై తూర్పు లక్నో డిసిపి హిర్దేష్ కుమార్ స్పందించారు. స్కూలు విద్యార్థిని వెంటబడి వేధించిన సదాఖత్ అలీ అనే ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఐపిసిలోని సంబంధిత సెక్షన్లతోపాటు పోక్సో చట కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డిసిపి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News