Friday, November 22, 2024

ఇన్‌స్పెక్టర్‌ వివాహేతర సంబంధం… నో ఇంక్రిమెంట్స్.. నో ప్రమోషన్స్

- Advertisement -
- Advertisement -

Police suspended increment one year due illicit affair

ముంబయి: వివాహేతర సంబంధం పోలీస్ అధికారి కొంపముంచిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధన్ రాజ్ ప్రభాలే అనే వ్యక్తి నాగపద పోలీస్ స్టేషన్ లో  అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఓ మహిళ క్యాటరింగ్ సంబంధించి ఫేస్ బుక్ పోస్టు పెట్టడంతో ధన్ రాజ్ కు ఆమె పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు సహాయం చేస్తానంటూ ధన్ రాజ్ వాడుకున్నాడని ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. పై అధికారులు విచారణకు ఆదేశించగా అతడు దోషిగా తేలాడు. ఉన్నతాధికారులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక్రిమెంట్స్ రద్దు చేయడంతో ప్రమోషన్స్, కొన్ని మెడల్స్ అందుకోవడానికి అనర్హుడిగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News