Friday, December 20, 2024

కేజ్రీవాల్ నివాసానికి పోలీసు టీం

- Advertisement -
- Advertisement -

సిసిటీవీ రికార్డర్ స్వాధీనం..స్వాతి ఎఫెక్ట్

న్యూఢిల్లీ : ఆప్ రాజ్యసభ ఎంపి స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసుకు సంబంధించి విచారణకు ఢిల్లీ పోలీసు బృందం ఆదివారం కేజ్రీవాల్ నివాసానికి వచ్చింది. ముందుగా అక్కడి సిసిటీవీ డిజిటల్ రికార్డర్‌ను స్వాధీనపర్చుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలోనే మాలీవాల్‌పై దాడి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. కేజ్రీవాల్ సన్నిహిత సహాయకులు బీభవ్ కుమార్ నివాసంలో స్వాతిపై దురుసుగా వ్యవహరించినట్లు, తీవ్రస్థాయిలో దాడి చేసి కొట్టినట్లు వచ్చిన వార్తలు దేశవ్యాప్త దుమారానికి దారితీశాయి. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్‌ను ఇరకాటంలోకి నెట్టాయి.

పోలీసు బృందం ఇక్కడికి రాగానే నివాసంలోని పలు ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అదుపులోకి తీసుకున్నాయి. వీటిలో సిసిటీవీ డివిఆర్ కూడా ఉంది. తనపై దాడి చేసిన తరువాత ఉద్ధేశపూరితంగానే నివాసంలోని సిసిటీవీ రికార్డును పనిచేయకుండా చేశారని, ఫుటేజ్‌ను తారుమారు చేశారని స్వాతి ఆరోపించింది. ఈ దాడి ఆరోపణల కేసులో బీభవ్‌ను శనివారం అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఐదురోజుల పోలీసు కస్టడీకి పంపించారు. విచారణ క్రమంలో కుమార్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని పోలీసు అధికారులు చెపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News